భారీ బడ్జెట్‌తో నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ "శక్తి" అనుకున్న రేంజ్‌లో లేదన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటులకు మంచి మార్కులు పడ్డా... సినిమా సక్సెస్‌ను బట్టి అది మారిపోతుంటుంది.
ఇపుడు ఇలియానా పరిస్థితి కూడా అలాగే ఉన్నదట. శక్తితో టాలీవుడ్‌ను దున్నేద్దామనుకున్న ఈ భామ కాస్తంత నిరుత్సాహానికి గురైందట. దీంతో రానాతో నటిస్తున్న నేనూ - నా రాక్షసిపైనే అన్ని ఆశలు పెట్టుకున్నదట. ఈ చిత్రమైనా హిట్ సాధిస్తే మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవచ్చని అనుకుంటోందట.
ఇదిలావుంటే ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని అంగీకరించింది. టాలీవుడ్ మాత్రం ఇలియానాను ఐరన్ లెగ్‌గా పరిగణించి ఆమెకు ఛాన్సిచ్చేందుకు ముందుకు రావడం లేదు. కానీ తెలుగులో తను తీరిక లేకుండా ఉంటున్నానని కాకమ్మ కబుర్లు చెపుతోంది ఇలియానా.