Monday, 22 August 2011

ఏంటీ.. లారెన్స్‌తో నాకు లింకా..?! అవన్నీ వట్టి గాలి వాగుళ్లు


Kindle 3G, Free 3G + Wi-Fi, 3G Works Globally, Graphite, 6" Display with New E Ink Pearl Technology - includes Special Offers & Sponsored Screensaversకాంచన చిత్రంలో లారెన్స్ ప్రక్కన నటించిన లక్ష్మీరాయ్ అతడి వెంటే రాత్రింబవళ్లు తిరుగుతోందట. ఈ తిరుగుళ్లను చూసిన కోలీవుడ్ సినీజనం ఇద్దరి మధ్యా విడదీయలేని బంధం పెనవేసుకపోయిందని గుసగుసలు పోతున్నారట.

లక్ష్మీరాయ్ మాత్రం అవన్నీ వట్టి గాలి వాగుళ్లని కొట్టి పారేస్తుంది. తను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాననీ, అంతమాత్రాన దానికేదో లింకులు పెట్టి పుకార్లు పుట్టించడంపై ఆమె రుసరుసలాడింది.

ఏదైనా ఓ సినిమాలో ఓ హీరోతో నటిస్తే.. అతడితో లింకులు పెడుతూ గాలివార్తలు సృష్టించడం నేడు ఫ్యాషనైపోయిందని అంది. ఎటువంటి ఆధారం లేని ఈ గాలివార్తలకు బదులు చెప్పీచెప్పీ విసుగుపుట్టిపోయిందని అంటోంది ఈ ముద్దుగుమ్మ

బిజీ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగిన తమన్నా


తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకున్న పాలబుగ్గల చిన్నది తమన్నా.. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవలి కాలంలో బిజీ హీరోయిన్ రెంజ్‌కు ఎదిగిపోయింది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. కొంతకాలం పాటు తెలుగు మినహా ఇతర భాషల్లో కనిపిస్తూ వచ్చింది.

అయితే, తెలుగు చిత్రాల్లో కనిపించని ఈ మిల్క్ బ్యూటీ ఈ మధ్య నాగచైతన్యతో నటించిన "100% లవ్" చిత్రంతో మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. గత కొంత కాలంగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టిన తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో సంపత్ నంది రూపొందిస్తున్న "రచ్చ" చిత్రంలోనూ అలాగే జూ.ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న "ఊసరవెల్లి" చిత్రంతో పాటు రామ్‌తో ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ రూపొందిస్తున్న "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలోనటిస్తున్నారు. తాజాగా గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. మొత్తంమీద ఇపుడు చేతిలో నాలుగు చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది.

నెట్‌లో "ఇది ప్రేమకథ కాదు" హీరోయిన్ బాత్రూం సీ


క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చిత్రం ఇది ప్రేమకథ కాదులో హీరోయిన్‌గా నటించిన మహీగిల్ తన అందాలను అడిగినంత మేరకు ఆరబోసిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అందాలు సినిమాలో చూపించలేననుకున్న వర్మ సెన్సార్ కంటే ముందే అటువంటి సీన్లపై సొంత కత్తెర వేశాడు.

అయినప్పటికీ సినీ ప్రమోషన్‌లో భాగమో.. మరేమోగానీ మహీగిల్ బాత్రూంలో స్నానం చేసిన ఘట్టాలు ఇపుడు అంతర్జాలం(నెట్)లో దర్శనమిస్తున్నాయి. శరీరంపై నూలుపోగు లేకుండా మహీ స్నానం చేస్తున్నట్లుగా ఆ వీడియో క్లిప్పింగులున్నట్లు నెట్ జనం చెపుతున్నారు.

కానీ కథ డిమాండ్ మేరకు ఎలా కావాలంటే అలా నటించాననీ, అలా నటించినందుకు తానేమీ సిగ్గుపడటం లేదని మహీ చెప్పుకోవడం కొసమెరుపు.

i dont have any link with larence:sradadas


తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు మత్తులో మునిగి తేలడం సహజం. ఈ మత్తు మద్యపానం లేదా డ్రగ్స్‌ వంటివి కూడా ఉండొచ్చు. ఆ మధ్య హీరో రవితేజ సోదరులు డ్రగ్స్ కొంటూ అడ్డం దొరిక పోగా, అనంతరం ఓ నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తు పట్టు పడ్డారు. ఇలాంటి సంఘటనలు టాలీవుడ్‌‍కు డ్రగ్స్‌కు ఉన్న సంబంధాలను తేటతెల్లం చేశారు.

అయితే, ఈ హైక్లాస్ మత్తు అలవాటు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.... దొరితే దొంగలు, లేక పోతే దొరలే అన్న చందంగా సాగుతూ వచ్చింది. కానీ, రవితేజ సోదరులు పట్టుబడటంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ లింకులు యువహీరో వరుణ్ సందేశ్‌కు సంబంధం ఉన్నట్టు తేలింది.

దీంతో అప్పటి వరకు వరుణ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరోయిన్ శ్రద్ధాదాస్ బాగా దూరమైంది. ఆమెతో టచ్‌లో ఉండాలని వరుణ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఈ అమ్మడు మాత్రం ససేమిరా అంటోంది. నీతో సన్నిహితంగా ఉంటే తనకూ డ్రగ్స్ అవాటు ఉన్నట్లు అనుమానిస్తారని ముఖాన్నే చెప్పేసిందట. అందువల్ల తనకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిందట

మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది: ప్రీ


అబ్బా.. ఈ మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోందని సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింతా అంటోంది. ఏ పుట్టలో ఎలాంటి పాముందో ఎవరికేం తెలుసని అంటోంది. అందుకే.. మగరాయుళ్ళ చెంతకు చేరాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సి వస్తోందని వాపోతోంది.

ఇంతకీ.. ఈ సొట్టబుగ్గల చిన్నదాన్ని అంతగా భయపెట్టిన మగాడెవరబ్బా అని బాలీవుడ్ పరిశ్రమ చర్చించుకుంటుందట. ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా, జనం ఏదో ఒక లింకు పెట్టేస్తున్నారట. తన క్రికెట్ ఫ్రాంచైజీ భాగస్వామి నెస్ వాడియాతో ఆమె దోస్తీ ఇటీవలే చెడిన విషయం తెల్సిందే. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రీతీ చా....లా క్లోజ్‌గా ఉంన్నది. అలాగే, ఒకప్పటి తన టీం ఆటగాడు బ్రెట్‌లీతోనూ ఇదే విధంగా ఉండటమే కాకుండా ఓ నైట్ పార్టీలో వీరిద్దరు మరింతగా దగ్గరైనట్టు ఆ మధ్య వదంతులు కూడా వచ్చాయి.

అందుకే.. ఏ మగాడితో మాట్లాడినా.. లేనిపోని గోల ఎందుకంటూ ఆమె ఏకంగా మగాళ్లతో మాట్లాడడం మానేసిందట. దీనిపై ఈ లిరిల్ గళ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్‌పైనే. ఎవరైనా మగాళ్లు పలుకరించినా, మీ ఆవిడతో కలిసున్నపుడే పలకరించండి అని చెప్పేస్తున్నా. ఎందుకంటే ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా ఏదో ఒక లింకు అంటగట్టేస్తున్నారు. ఇలా ఉండడం నాకు చాలా బాధగానే అనిపిస్తోందని

Sunday, 14 August 2011

పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోనున్న త్రిషా


trisha marriage
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగాలకు చెందిన కుర్రకారు గుండెల్లో కలల రాణిగా తిష్ట వేసిన చెన్నయ్ సోయగం త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతోందా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి చెన్నయ్ కోడంబాక్కం వర్గాలు. గత కొంత కాలంగా ఈ విషయం మీద వార్తలొస్తున్నప్పటికీ ఇపుడు మరింత ఎక్కువయ్యాయి. నగరానికి చెందిన అమృత్ అనే యువ పారిశ్రామికవేత్తను త్రిష గత కొంత కాలంగా ప్రేమిస్తోందనీ, వచ్చే నెలలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్టు చెన్నయ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

అందుకు తగినట్టుగానే ఆమె సినిమాలు కూడా తగ్గించేసుకుంది. మూడు పదుల వయసులో వున్న త్రిష, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటోంది. అయితే, ఈ వార్తల్ని ఆమె కుటుంబసభ్యులు మాత్రం కొట్టిపారేస్తుండగా, త్రిషా మాత్రం పెదవి విప్పడం లేదు. ఇవన్నీ ఒట్టి పుకార్లేననీ, త్రిష పెళ్లి అందరికీ చెప్పే జరుపుతామనీ ఆమె తల్లి ఉమా కృష్ణన్ అంటోంది.