Wednesday, 12 March 2014
Mahesh -'ఆగడు'. గుజరాత్ లో
సూపర్ స్టార్ మహేష్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'ఆగడు'. మహేష్ తో 'దూకుడు', '1-నేనొక్కడినే' సినిమాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ షెడ్యూల్ ను ఈ నెలాఖరున ముగించి తదుపరి షెడ్యూల్ ను ఏప్రిల్ లో గుజరాత్ లో చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. అంటే మహేష్ నెక్ట్స్ గుజరాత్ కి వెళ్లనున్నాడన్నమాట. 2014 ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
varma support pawen in politics
పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గొత్తెత్తిన వారిలో క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉన్నాడు. తన ట్వీట్టర్ ద్వారా పవన్ రాజకీయాల్లోకి రావాలని చాలాసార్లు చెప్పాడు. తాజాగా పవన్ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ కాగానే ఆయన పవన్ కల్యాణ్ కి తన సపోర్ట్ అందిస్తున్నాడు.
జనసేన ఒక పార్టీ అనుకుంటే మూర్ఖత్వం అవుతుందని, ప్రజల కోసం సృష్టించబడ్డ మరో ప్రభంజనమని, తెలివి, అభిమానం, పౌరుషం, నీతి ఉన్నావాడెవడైనా పవన్ కల్యాణ్ కే ఓటు వేస్తాడని, పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడని, అతన్ని తెలుగు ప్రజలు గెలిపించుకుంటారని, ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలు జనసేనలో జరగవని, అది పార్టీ పేరులోనే ఉందని,
పేరులోనే ఇంత పవర్ ఉంటే పార్టీలో ఇంకెంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని, శివసేన పార్టీ కన్నా 1000 రెట్లు మెరుగైనా పార్టీ అని, పవన్ కల్యాణ్ కి తనదైన స్టైల్లో సపోర్ట్ చేస్తున్నాడు. ఇది వరకు తాను ఓటు వేయలేదని పవన్ కల్యాణ్ పార్టీ పెడితే నా ఓటు తనకేనంటూ చెప్పిన రామ్ గోపాల్ వర్మ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. మరి పవన్ కల్యాణ్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడో మరి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది. ఆయన మాటల్లోనే కచ్చితత్వం, నిజాయితీ, విధివిధానాల్లో సింప్లిసిటి. అందుకే ఆయన ఆఖిలాంధ్రప్రేక్షకులకు ఆరాధ్యుడయ్యాడు. భావ ప్రకటనలో ఆయన శైలి ఎంతో ప్రత్యేకమైనది. తనకు నచ్చిన విషయాన్ని ఎంత సరాదాగా పంచుకుంటారో తనకి నచ్చని విషయాన్ని అంతే ఘాటుగా, సూటిగా వ్యవహరిస్తారు. తాను పవర్ కోసం కాదు, ప్రశ్నించడానికి అనగానే అప్పటివరకు ఉన్న అభిమానం వెయ్యింతలయ్యింది.
తాజాగా తన పార్టీ పేరును 'జనసేన'గా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ముఖ్యంగా యువత పవన్ పార్టీపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ కల్యాణ్ పేరు మారు మ్రోగుతోంది. తెలుగువారందరూ పవన్ రాజకీయ ప్రవేశం కోసం అతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఈ నెల 14న హైటెక్స్ లో అత్యంత భారీగా నిర్వహించబడనున్న పవన్ రాజకీయ సభను చూసేందుకు ప్రత్యేకించి స్వచ్చందంగా స్ర్కీన్ లు ఏర్పాటు చేసుకోవడం విశేషం.
అలాగే 14న హైదరాబాద్ కు భారీగా అభిమానులు తరలి వచ్చేందుకు అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సభలో పవన్ 45 నిమిషాలు ప్రసంగిస్తారని తెలిసేసరికి పవన్ ఏం మాట్లాడుతాడు? ఎవరి గురించి మాట్లాడుతాడు? పవన్ పార్టీ అజెండా ఏమిటి? జెండా ఎలా ఉండబోతుంది? వంటి విషయాలపై ఉత్సుకత అందరిలోను నెలకొంది!
Subscribe to:
Posts (Atom)