పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది. ఆయన మాటల్లోనే కచ్చితత్వం, నిజాయితీ, విధివిధానాల్లో సింప్లిసిటి. అందుకే ఆయన ఆఖిలాంధ్రప్రేక్షకులకు ఆరాధ్యుడయ్యాడు. భావ ప్రకటనలో ఆయన శైలి ఎంతో ప్రత్యేకమైనది. తనకు నచ్చిన విషయాన్ని ఎంత సరాదాగా పంచుకుంటారో తనకి నచ్చని విషయాన్ని అంతే ఘాటుగా, సూటిగా వ్యవహరిస్తారు. తాను పవర్ కోసం కాదు, ప్రశ్నించడానికి అనగానే అప్పటివరకు ఉన్న అభిమానం వెయ్యింతలయ్యింది.
తాజాగా తన పార్టీ పేరును 'జనసేన'గా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ముఖ్యంగా యువత పవన్ పార్టీపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ కల్యాణ్ పేరు మారు మ్రోగుతోంది. తెలుగువారందరూ పవన్ రాజకీయ ప్రవేశం కోసం అతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఈ నెల 14న హైటెక్స్ లో అత్యంత భారీగా నిర్వహించబడనున్న పవన్ రాజకీయ సభను చూసేందుకు ప్రత్యేకించి స్వచ్చందంగా స్ర్కీన్ లు ఏర్పాటు చేసుకోవడం విశేషం.
అలాగే 14న హైదరాబాద్ కు భారీగా అభిమానులు తరలి వచ్చేందుకు అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సభలో పవన్ 45 నిమిషాలు ప్రసంగిస్తారని తెలిసేసరికి పవన్ ఏం మాట్లాడుతాడు? ఎవరి గురించి మాట్లాడుతాడు? పవన్ పార్టీ అజెండా ఏమిటి? జెండా ఎలా ఉండబోతుంది? వంటి విషయాలపై ఉత్సుకత అందరిలోను నెలకొంది!
No comments:
Post a Comment