tollywood
Wednesday, 12 March 2014
Mahesh -'ఆగడు'. గుజరాత్ లో
సూపర్ స్టార్ మహేష్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'ఆగడు'. మహేష్ తో 'దూకుడు', '1-నేనొక్కడినే' సినిమాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ షెడ్యూల్ ను ఈ నెలాఖరున ముగించి తదుపరి షెడ్యూల్ ను ఏప్రిల్ లో గుజరాత్ లో చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. అంటే మహేష్ నెక్ట్స్ గుజరాత్ కి వెళ్లనున్నాడన్నమాట. 2014 ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
varma support pawen in politics
పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గొత్తెత్తిన వారిలో క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉన్నాడు. తన ట్వీట్టర్ ద్వారా పవన్ రాజకీయాల్లోకి రావాలని చాలాసార్లు చెప్పాడు. తాజాగా పవన్ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ కాగానే ఆయన పవన్ కల్యాణ్ కి తన సపోర్ట్ అందిస్తున్నాడు.
జనసేన ఒక పార్టీ అనుకుంటే మూర్ఖత్వం అవుతుందని, ప్రజల కోసం సృష్టించబడ్డ మరో ప్రభంజనమని, తెలివి, అభిమానం, పౌరుషం, నీతి ఉన్నావాడెవడైనా పవన్ కల్యాణ్ కే ఓటు వేస్తాడని, పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడని, అతన్ని తెలుగు ప్రజలు గెలిపించుకుంటారని, ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలు జనసేనలో జరగవని, అది పార్టీ పేరులోనే ఉందని,
పేరులోనే ఇంత పవర్ ఉంటే పార్టీలో ఇంకెంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని, శివసేన పార్టీ కన్నా 1000 రెట్లు మెరుగైనా పార్టీ అని, పవన్ కల్యాణ్ కి తనదైన స్టైల్లో సపోర్ట్ చేస్తున్నాడు. ఇది వరకు తాను ఓటు వేయలేదని పవన్ కల్యాణ్ పార్టీ పెడితే నా ఓటు తనకేనంటూ చెప్పిన రామ్ గోపాల్ వర్మ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. మరి పవన్ కల్యాణ్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడో మరి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది. ఆయన మాటల్లోనే కచ్చితత్వం, నిజాయితీ, విధివిధానాల్లో సింప్లిసిటి. అందుకే ఆయన ఆఖిలాంధ్రప్రేక్షకులకు ఆరాధ్యుడయ్యాడు. భావ ప్రకటనలో ఆయన శైలి ఎంతో ప్రత్యేకమైనది. తనకు నచ్చిన విషయాన్ని ఎంత సరాదాగా పంచుకుంటారో తనకి నచ్చని విషయాన్ని అంతే ఘాటుగా, సూటిగా వ్యవహరిస్తారు. తాను పవర్ కోసం కాదు, ప్రశ్నించడానికి అనగానే అప్పటివరకు ఉన్న అభిమానం వెయ్యింతలయ్యింది.
తాజాగా తన పార్టీ పేరును 'జనసేన'గా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ముఖ్యంగా యువత పవన్ పార్టీపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ కల్యాణ్ పేరు మారు మ్రోగుతోంది. తెలుగువారందరూ పవన్ రాజకీయ ప్రవేశం కోసం అతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఈ నెల 14న హైటెక్స్ లో అత్యంత భారీగా నిర్వహించబడనున్న పవన్ రాజకీయ సభను చూసేందుకు ప్రత్యేకించి స్వచ్చందంగా స్ర్కీన్ లు ఏర్పాటు చేసుకోవడం విశేషం.
అలాగే 14న హైదరాబాద్ కు భారీగా అభిమానులు తరలి వచ్చేందుకు అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సభలో పవన్ 45 నిమిషాలు ప్రసంగిస్తారని తెలిసేసరికి పవన్ ఏం మాట్లాడుతాడు? ఎవరి గురించి మాట్లాడుతాడు? పవన్ పార్టీ అజెండా ఏమిటి? జెండా ఎలా ఉండబోతుంది? వంటి విషయాలపై ఉత్సుకత అందరిలోను నెలకొంది!
Monday, 22 August 2011
ఏంటీ.. లారెన్స్‌తో నాకు లింకా..?! అవన్నీ వట్టి గాలి వాగుళ్లు
లక్ష్మీరాయ్ మాత్రం అవన్నీ వట్టి గాలి వాగుళ్లని కొట్టి పారేస్తుంది. తను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాననీ, అంతమాత్రాన దానికేదో లింకులు పెట్టి పుకార్లు పుట్టించడంపై ఆమె రుసరుసలాడింది.
ఏదైనా ఓ సినిమాలో ఓ హీరోతో నటిస్తే.. అతడితో లింకులు పెడుతూ గాలివార్తలు సృష్టించడం నేడు ఫ్యాషనైపోయిందని అంది. ఎటువంటి ఆధారం లేని ఈ గాలివార్తలకు బదులు చెప్పీచెప్పీ విసుగుపుట్టిపోయిందని అంటోంది ఈ ముద్దుగుమ్మ
బిజీ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన తమన్నా
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకున్న పాలబుగ్గల చిన్నది తమన్నా.. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవలి కాలంలో బిజీ హీరోయిన్ రెంజ్‌కు ఎదిగిపోయింది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. కొంతకాలం పాటు తెలుగు మినహా ఇతర భాషల్లో కనిపిస్తూ వచ్చింది.
అయితే, తెలుగు చిత్రాల్లో కనిపించని ఈ మిల్క్ బ్యూటీ ఈ మధ్య నాగచైతన్యతో నటించిన "100% లవ్" చిత్రంతో మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. గత కొంత కాలంగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టిన తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో సంపత్ నంది రూపొందిస్తున్న "రచ్చ" చిత్రంలోనూ అలాగే జూ.ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న "ఊసరవెల్లి" చిత్రంతో పాటు రామ్‌తో ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ రూపొందిస్తున్న "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలోనటిస్తున్నారు. తాజాగా గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. మొత్తంమీద ఇపుడు చేతిలో నాలుగు చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది.
నెట్‌లో "ఇది ప్రేమకథ కాదు" హీరోయిన్ బాత్రూం సీ
క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చిత్రం ఇది ప్రేమకథ కాదులో హీరోయిన్‌గా నటించిన మహీగిల్ తన అందాలను అడిగినంత మేరకు ఆరబోసిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అందాలు సినిమాలో చూపించలేననుకున్న వర్మ సెన్సార్ కంటే ముందే అటువంటి సీన్లపై సొంత కత్తెర వేశాడు.
అయినప్పటికీ సినీ ప్రమోషన్‌లో భాగమో.. మరేమోగానీ మహీగిల్ బాత్రూంలో స్నానం చేసిన ఘట్టాలు ఇపుడు అంతర్జాలం(నెట్)లో దర్శనమిస్తున్నాయి. శరీరంపై నూలుపోగు లేకుండా మహీ స్నానం చేస్తున్నట్లుగా ఆ వీడియో క్లిప్పింగులున్నట్లు నెట్ జనం చెపుతున్నారు.
కానీ కథ డిమాండ్ మేరకు ఎలా కావాలంటే అలా నటించాననీ, అలా నటించినందుకు తానేమీ సిగ్గుపడటం లేదని మహీ చెప్పుకోవడం కొసమెరుపు.
Subscribe to:
Posts (Atom)