Monday, 22 August 2011
బిజీ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన తమన్నా
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకున్న పాలబుగ్గల చిన్నది తమన్నా.. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవలి కాలంలో బిజీ హీరోయిన్ రెంజ్‌కు ఎదిగిపోయింది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. కొంతకాలం పాటు తెలుగు మినహా ఇతర భాషల్లో కనిపిస్తూ వచ్చింది.
అయితే, తెలుగు చిత్రాల్లో కనిపించని ఈ మిల్క్ బ్యూటీ ఈ మధ్య నాగచైతన్యతో నటించిన "100% లవ్" చిత్రంతో మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. గత కొంత కాలంగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టిన తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో సంపత్ నంది రూపొందిస్తున్న "రచ్చ" చిత్రంలోనూ అలాగే జూ.ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న "ఊసరవెల్లి" చిత్రంతో పాటు రామ్‌తో ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ రూపొందిస్తున్న "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలోనటిస్తున్నారు. తాజాగా గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. మొత్తంమీద ఇపుడు చేతిలో నాలుగు చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment