Monday, 22 August 2011

ఏంటీ.. లారెన్స్‌తో నాకు లింకా..?! అవన్నీ వట్టి గాలి వాగుళ్లు


Kindle 3G, Free 3G + Wi-Fi, 3G Works Globally, Graphite, 6" Display with New E Ink Pearl Technology - includes Special Offers & Sponsored Screensaversకాంచన చిత్రంలో లారెన్స్ ప్రక్కన నటించిన లక్ష్మీరాయ్ అతడి వెంటే రాత్రింబవళ్లు తిరుగుతోందట. ఈ తిరుగుళ్లను చూసిన కోలీవుడ్ సినీజనం ఇద్దరి మధ్యా విడదీయలేని బంధం పెనవేసుకపోయిందని గుసగుసలు పోతున్నారట.

లక్ష్మీరాయ్ మాత్రం అవన్నీ వట్టి గాలి వాగుళ్లని కొట్టి పారేస్తుంది. తను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాననీ, అంతమాత్రాన దానికేదో లింకులు పెట్టి పుకార్లు పుట్టించడంపై ఆమె రుసరుసలాడింది.

ఏదైనా ఓ సినిమాలో ఓ హీరోతో నటిస్తే.. అతడితో లింకులు పెడుతూ గాలివార్తలు సృష్టించడం నేడు ఫ్యాషనైపోయిందని అంది. ఎటువంటి ఆధారం లేని ఈ గాలివార్తలకు బదులు చెప్పీచెప్పీ విసుగుపుట్టిపోయిందని అంటోంది ఈ ముద్దుగుమ్మ

బిజీ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగిన తమన్నా


తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకున్న పాలబుగ్గల చిన్నది తమన్నా.. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవలి కాలంలో బిజీ హీరోయిన్ రెంజ్‌కు ఎదిగిపోయింది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. కొంతకాలం పాటు తెలుగు మినహా ఇతర భాషల్లో కనిపిస్తూ వచ్చింది.

అయితే, తెలుగు చిత్రాల్లో కనిపించని ఈ మిల్క్ బ్యూటీ ఈ మధ్య నాగచైతన్యతో నటించిన "100% లవ్" చిత్రంతో మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. గత కొంత కాలంగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టిన తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో సంపత్ నంది రూపొందిస్తున్న "రచ్చ" చిత్రంలోనూ అలాగే జూ.ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న "ఊసరవెల్లి" చిత్రంతో పాటు రామ్‌తో ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ రూపొందిస్తున్న "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలోనటిస్తున్నారు. తాజాగా గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. మొత్తంమీద ఇపుడు చేతిలో నాలుగు చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది.

నెట్‌లో "ఇది ప్రేమకథ కాదు" హీరోయిన్ బాత్రూం సీ


క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చిత్రం ఇది ప్రేమకథ కాదులో హీరోయిన్‌గా నటించిన మహీగిల్ తన అందాలను అడిగినంత మేరకు ఆరబోసిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అందాలు సినిమాలో చూపించలేననుకున్న వర్మ సెన్సార్ కంటే ముందే అటువంటి సీన్లపై సొంత కత్తెర వేశాడు.

అయినప్పటికీ సినీ ప్రమోషన్‌లో భాగమో.. మరేమోగానీ మహీగిల్ బాత్రూంలో స్నానం చేసిన ఘట్టాలు ఇపుడు అంతర్జాలం(నెట్)లో దర్శనమిస్తున్నాయి. శరీరంపై నూలుపోగు లేకుండా మహీ స్నానం చేస్తున్నట్లుగా ఆ వీడియో క్లిప్పింగులున్నట్లు నెట్ జనం చెపుతున్నారు.

కానీ కథ డిమాండ్ మేరకు ఎలా కావాలంటే అలా నటించాననీ, అలా నటించినందుకు తానేమీ సిగ్గుపడటం లేదని మహీ చెప్పుకోవడం కొసమెరుపు.

i dont have any link with larence:sradadas


తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు మత్తులో మునిగి తేలడం సహజం. ఈ మత్తు మద్యపానం లేదా డ్రగ్స్‌ వంటివి కూడా ఉండొచ్చు. ఆ మధ్య హీరో రవితేజ సోదరులు డ్రగ్స్ కొంటూ అడ్డం దొరిక పోగా, అనంతరం ఓ నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తు పట్టు పడ్డారు. ఇలాంటి సంఘటనలు టాలీవుడ్‌‍కు డ్రగ్స్‌కు ఉన్న సంబంధాలను తేటతెల్లం చేశారు.

అయితే, ఈ హైక్లాస్ మత్తు అలవాటు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.... దొరితే దొంగలు, లేక పోతే దొరలే అన్న చందంగా సాగుతూ వచ్చింది. కానీ, రవితేజ సోదరులు పట్టుబడటంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ లింకులు యువహీరో వరుణ్ సందేశ్‌కు సంబంధం ఉన్నట్టు తేలింది.

దీంతో అప్పటి వరకు వరుణ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరోయిన్ శ్రద్ధాదాస్ బాగా దూరమైంది. ఆమెతో టచ్‌లో ఉండాలని వరుణ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఈ అమ్మడు మాత్రం ససేమిరా అంటోంది. నీతో సన్నిహితంగా ఉంటే తనకూ డ్రగ్స్ అవాటు ఉన్నట్లు అనుమానిస్తారని ముఖాన్నే చెప్పేసిందట. అందువల్ల తనకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిందట

మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది: ప్రీ


అబ్బా.. ఈ మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోందని సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింతా అంటోంది. ఏ పుట్టలో ఎలాంటి పాముందో ఎవరికేం తెలుసని అంటోంది. అందుకే.. మగరాయుళ్ళ చెంతకు చేరాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సి వస్తోందని వాపోతోంది.

ఇంతకీ.. ఈ సొట్టబుగ్గల చిన్నదాన్ని అంతగా భయపెట్టిన మగాడెవరబ్బా అని బాలీవుడ్ పరిశ్రమ చర్చించుకుంటుందట. ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా, జనం ఏదో ఒక లింకు పెట్టేస్తున్నారట. తన క్రికెట్ ఫ్రాంచైజీ భాగస్వామి నెస్ వాడియాతో ఆమె దోస్తీ ఇటీవలే చెడిన విషయం తెల్సిందే. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రీతీ చా....లా క్లోజ్‌గా ఉంన్నది. అలాగే, ఒకప్పటి తన టీం ఆటగాడు బ్రెట్‌లీతోనూ ఇదే విధంగా ఉండటమే కాకుండా ఓ నైట్ పార్టీలో వీరిద్దరు మరింతగా దగ్గరైనట్టు ఆ మధ్య వదంతులు కూడా వచ్చాయి.

అందుకే.. ఏ మగాడితో మాట్లాడినా.. లేనిపోని గోల ఎందుకంటూ ఆమె ఏకంగా మగాళ్లతో మాట్లాడడం మానేసిందట. దీనిపై ఈ లిరిల్ గళ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్‌పైనే. ఎవరైనా మగాళ్లు పలుకరించినా, మీ ఆవిడతో కలిసున్నపుడే పలకరించండి అని చెప్పేస్తున్నా. ఎందుకంటే ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా ఏదో ఒక లింకు అంటగట్టేస్తున్నారు. ఇలా ఉండడం నాకు చాలా బాధగానే అనిపిస్తోందని

Sunday, 14 August 2011

పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోనున్న త్రిషా


trisha marriage
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగాలకు చెందిన కుర్రకారు గుండెల్లో కలల రాణిగా తిష్ట వేసిన చెన్నయ్ సోయగం త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతోందా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి చెన్నయ్ కోడంబాక్కం వర్గాలు. గత కొంత కాలంగా ఈ విషయం మీద వార్తలొస్తున్నప్పటికీ ఇపుడు మరింత ఎక్కువయ్యాయి. నగరానికి చెందిన అమృత్ అనే యువ పారిశ్రామికవేత్తను త్రిష గత కొంత కాలంగా ప్రేమిస్తోందనీ, వచ్చే నెలలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్టు చెన్నయ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

అందుకు తగినట్టుగానే ఆమె సినిమాలు కూడా తగ్గించేసుకుంది. మూడు పదుల వయసులో వున్న త్రిష, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటోంది. అయితే, ఈ వార్తల్ని ఆమె కుటుంబసభ్యులు మాత్రం కొట్టిపారేస్తుండగా, త్రిషా మాత్రం పెదవి విప్పడం లేదు. ఇవన్నీ ఒట్టి పుకార్లేననీ, త్రిష పెళ్లి అందరికీ చెప్పే జరుపుతామనీ ఆమె తల్లి ఉమా కృష్ణన్ అంటోంది.

Friday, 12 August 2011

దర్శక నిర్మాతలు బయట కూడా ఎక్స్‌పోజ్ చేయమంటారు: అ


తన పేరులో ఉన్న విలక్షణతను నటనలోనూ చూపాలన్నది అక్ష కోరిక. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికి అక్ష నటించిన మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు ఘనవిజయం సాధించినవే కావడాన్నిబట్టి సినిమాల ఎంపికలో ఆమె తీసుకునే శ్రద్ధాసక్తులు మనకు సునాయాసంగా అర్థమవుతాయి. 

'యువత' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, ఆ చిత్రంతో యువతను విశేషంగా ఆకట్టుకున్న అక్ష రెండో చిత్రం 'రైడ్‌'తో తన కెరీర్‌కు ద్వితీయ విఘ్నం లేకుండా చేసుకోగలిగింది. మూడో చిత్రం 'అది నువ్వే' కాస్త నిరాశ పరిచినప్పటికీ తాజా చిత్రం 'కందిరీగ' తన కెరీర్‌కు కీలకం కానుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని అక్షతో ప్రత్యేకంగా జరిపిన ఇంటర్య్వూ.

WD
'కందిరీగ'లో మీ క్యారెక్టర్‌ ఏమిటి? 
ఫస్ట్‌ ఫస్ట్‌ క్యారెక్టర్‌ గురించి అడిగేశారా? నేనసలు చెప్పను గాక చెప్పను. నా పాత్ర చాలా కొత్తగా, భలే గమ్మత్తుగా ఉంటుందని మాత్రమే చెబుతాను. సిటీగర్ల్‌ క్యారెక్టర్‌ నాది. ఇందులో నేను మాట్లాడే భాష, నా బాడీలాంగ్వేజ్‌, నా డ్రెస్సింగ్‌ స్టయిల్‌ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఆడియన్స్‌ అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసే మంచి క్యారెక్టర్‌ 'కందిరీగ'లో పోషిస్తున్నాను.

WD
హీరో రామ్‌తో మొట్టమొదటిసారి జతకట్టారు కదా? ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్‌? 
సినిమాలపరంగా చూస్తే రామ్‌ నాకంటే చాలా సీనియర్‌. 'కందిరీగ' నేను నటిస్తున్న నాలుగో సినిమా మాత్రమే. నాకు అన్ని విషయాల్లోనూ ఓ కో-ఆర్టిస్టుగా చాలా సహకరించాడు. అతనిలోని ఎనర్జీ చూసి నేను చాలా సర్‌ప్రైజ్‌ అవుతుండేదాన్ని.

WD
హన్సికతో కలిసి నటించావు కదా. మీ ఇద్దరి మధ్య సఖ్యత బాగానే కుదిరిందా? 
హన్సిక కూడా నాకంటే సీనియర్‌ కదా. ఆమెతో కలిసి నేను మూడు సీన్స్‌ మాత్రమే చేశాను. ఆమె కూడా చాలా మంచి వ్యక్తి.

WD
'రైడ్‌' తర్వాత ఇదే బ్యానర్‌లో 'కందిరీగ' చేయడం మీకు ఎలా అనిపిస్తోంది? 
చాలా చాలా హ్యాపీగా వుంది. బెల్లంకొండ సురేష్‌గారు చాలా మంచి నిర్మాత. ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్లకు గానీ ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకసారి ఆయన బ్యానర్‌లో నటించిన వారు, పనిచేసిన వారు మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్‌లో వర్క్‌ చేయాలని కోరుకుంటారు.

WD
'కందిరీగ'లో మీ క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుందంటున్నారు‌. అందుకోసం హార్డ్‌వర్క్‌ చేయాల్సి వచ్చిందా? 
అవునండి. ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. అంతకు మించిన హోం వర్క్‌ కూడా చేశాను. చెప్పాను కదా. ఈ సినిమాలో నాది చాలా టిపికల్‌ క్యారెక్టర్‌. రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌కు భిన్నంగా ఉంటుంది.

WD
అవును. మీరింకా చదువుతున్నారట కదా? 
అవునండీ. నేను ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం ప్రైవేట్‌గా చదువుతున్నాను. ఈ రోజుల్లో మినిమం డిగ్రీ అయినా లేకపోతే కష్టం కదా.

WD
సినిమాల్లో నటిస్తూ చదువుకోవడం కష్టమనిపించడం లేదా? 
అసలు లేదు. చదువు కోసం రోజులో రెండు గంటలు విధిగా కేటాయిస్తాను. ఎప్పుడైనా ఒకరోజు మిస్సయితే మరుసటి రోజు అది, ఇది కలిపి చదివేసుకుంటాను.
WD


WD
యాడ్‌ ఫిలింస్‌లోనూ నటిస్తున్నారు కదూ? 
నేను చిన్నప్పట్నుంచి యాడ్‌ ఫిలింస్‌ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి వందకు పైగా యాడ్స్‌లో యాక్ట్‌ చేశాను. రణబీర్‌కపూర్‌తో కలిసి పెప్సీ యాడ్‌లో నటించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఎందుకంటే అతను నా ఫేవరెట్‌ హీరో.

WD
మరి తెలుగులో ఎవరంటే ఇష్టం? 
మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రామ్‌ వంటి హీరోలందరూ నాకు ఇష్టమైన వారే.

WD
హీరోయిన్స్‌లో ఎవరంటే ఇష్టం? 
హిందీలో ప్రియాంక, కత్రినా, కరీనాకపూర్‌. తెలుగులో అనుష్క, తమన్నా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ హార్డ్‌వర్కింగ్‌ నేచర్‌ని నేను చాలా ఇష్టపడతాను.

WD
'కందిరీగ' సినిమాపై మీకున్న అంచనాలేమిటి?
నేను యాక్ట్‌ చేశాను కాబట్టి చెప్పడం లేదు. యాక్ట్‌ చేశాను కాబట్టి తెలిసిన విషయం చెబుతున్నాను. 'కందిరీగ' చాలా పెద్ద రేంజ్‌లో హిట్టవుతుంది. నాతో పాటు ఈ సినిమాలో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్న సంతోష్‌ శ్రీనివాస్‌కు చాలా మంచి పేరు వస్తుంది. ఇక మా నిర్మాత బెల్లంకొండ సురేష్‌గారికి ఇప్పుడు కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాతో ఆయనకు బోలెడు డబ్బులొస్తాయి.

WD
చివరగా.. హీరోయిన్స్‌ సినిమాలోకంటే ఫంక్షకన్లకు బాగా ఎక్స్‌పోజ్‌గా కన్పిస్తున్నారు. మీరుకూడా ఓసారి అలా కన్పించారు? 
ఇదేమి తప్పుకాదు. సినిమాల్లో కన్పించినట్లు బయటకూడా కన్పిస్తే బాగుంటుందని నిర్మాత దర్శకులు కొన్నిసార్లు అలా రమ్మంటారు. దాన్ని మీరు మరింత ఎక్స్‌పోజ్‌ చేస్తారు.. నిజం చెప్పాలంటే.. ఇదో పబ్లిసిటీ.. అంటూ నవ్వేసింది.

పూరీకి కాజల్ మెగా ఆఫర్: టెంప్ట్ అవుతాడా...


కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఆఫర్ల కోసం వెంపర్లాడుతోంది. చేతిలో ఉన్న అన్ని అవకాశాలను బాలీవుడ్‌లో తిష్ట వేసేందుకు వినియోగించుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా కాజల్ మరో కొత్త ప్లాన్‌తో మరో బాలీవుడ్ అవకాశాన్ని ఎగరేసుకెళదామని ముందుకెళుతున్నట్లు టాలీవుడ్ న్యూస్. 

మహేశ్ బాబు సరసన "ది బిజినెస్ మేన్" చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. పూరీ ఇదే చిత్రాన్ని హిందీలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది తెలుసుకున్న కాజల్ పూరీ ముందు ఓ ఆఫర్ ఉంచిందట. 

అదేమంటే... హిందీలో కూడా హీరోయిన్‌గా తననే బుక్ చేస్తే ఫ్రీగా నటిస్తానని ఆఫర్ చేసిందట. అవసరమైతే తన పారితోషికాన్ని కూడా అటుఇటుగా చూసి తగ్గించేస్తానని పూరీని ఊరిస్తోందట. మరి కాజల్ ఆఫర్‌కు పూరీ టెంప్ట్ అవుతాడో లేదో చూడాలి.

బాడీపై ప్రభుదేవా టాట్టూ పొడిపించుకున్న నయ


నయనతారకు ప్రభుదేవా అంటే పిచ్చప్రేమట. అతడిని ఎంతగా ప్రేమిస్తుందంటే అతడి పేరును తన శరీరంపై చాలా పెద్దదిగా పొడిపించుకున్నదట. ఆ పచ్చబొట్టును చూసిన ఆమె స్నేహితులు ప్రభు అంటే నీకెంత ప్రేమో ఇప్పుడు తెలిసిందని అంటున్నారట. 

అన్నట్లు ప్రభుదేవాను పెళ్లి చేసుకునేందుకు హిందూ మతానికి మారిన నయనతార ఇప్పుడు ఆ మతంలో ఆచరించే వ్రతాలు, పూజలు వగైరా తెలిపే పుస్తకాలను చదివే పనిలో పడిందట. 

పెళ్లయిన తర్వాత తన అత్తారింట్లో సంప్రదాయబద్ధమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించాలంటే వాటికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, పూజా విధానాలు తెలిసి ఉండాలి కనుక నయన వాటిపై బాగా కసరత్తు చేస్తోందట. తన ప్రేమన బతికించుకోవడానికి ప్రభుదేవా మొదటి భార్యకే విడాకులిప్పించిన నయన, అత్తమామలను ఒప్పించడంలో కూడా సక్సెస్ కాక ఏమవుతుందని ఆమె ఫ్రెండ్స్ అంటున్నారు.

Wednesday, 10 August 2011

వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కట్: "రెబల్" షూటింగ్‌కు అనుష్క డుమ్మా..?!


ఆరడుగుల యువహీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం రెబల్. ఈ చిత్రానికి "కాంచన" ఫేమ్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటింపజేసేందుకు అతని పొడుగుకు సరిపోయే హీరోయిన్లను ఎంపిక చేశాడు లారెన్స్. 

వీరిలో ఒకరు దీక్షాసేథ్ కాగా మరొకరు అనుష్క. ఈ సినిమా షూటింగ్‌కు దీక్షాసేథ్ మాత్రమే వస్తోందట. అనుష్క డుమ్మా కొడుతున్నట్లు టాలీవుడ్ ఫిలిం జనం అనుకుంటున్నారు. దీనికి కారణాలను కూడా వాళ్లు ఊదేస్తున్నారు.

బిల్లా చిత్రాన్ని చేసే సమయంలో అనుష్క - ప్రభాస్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా నడిచిందని అంటున్నారు. అయితే ఆ కమెస్ట్రీ ఇటీవల కాలంలో బెడిసికొట్టడంతో ప్రభాస్ అంటే అనుష్కకు సరిపడటం లేదట. అందువల్లనే "రెబల్" చిత్రం షూటింగ్‌కు ఆమె రావడం లేదని భోగట్టా.

ద్విచక్ర వాహనం స్కిడ్: సమీరా రెడ్డికి ప్రమా


బాలీవుడ్ సినీనటి సమీరారెడ్డికి ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులో ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం రెయిన్ సాంగ్‌లో భాగంగా ద్విచక్రవాహనం నడుపుతుండగా ఆ వాహనం స్కిడ్ అయింది. దీంతో ఆమె వాహనంపై నుంచి బలంగా నేలపై పడింది. 

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సమీరారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలు అంతర్గతంగా కూడా ఉన్నాయేమోనని స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు.

Tuesday, 9 August 2011

సల్మాన్‌ను బుట్టలో వేసేందుకు శ్రియ గాలం!


హీరో రవితేజ నటించిన "డాన్‌శీను" చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన భామ శ్రియ. ఈ చిత్రం తర్వాత తెలుగులో భారీ అవకాశాలు దక్కుతాయని ఎంతగానో ఎదురు చూసింది. అయితే, ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో చేదు అనుభవమే మిగిలింది. దాంతో అడపాదడపా తమిళ చిత్రాల్లో నటిస్తున్న శ్రియకు తెలుగులో మాత్రం అల్లరి నరేష్‌తో నటించే స్థాయికి దిగజారి పోయింది. 

ఈ చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ.. సంతృప్తి చెందని ఈ పిల్ల.. బాలీవుడ్ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. ఇందుకోసం ఏకంగా సల్మాన్‌ఖాన్‌నే కాకా పడుతోందట. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన భామలకు సల్మాన్‌ఖాన్ అవకాశాలు కల్పించడంలో బాగా ముందున్న విషయం తెల్సిందే. 

దీంతో ఎలాగైనా సల్మాన్‌ను తన దారికి తెచ్చుకుని బాలీవుడ్‌లో సెటిలైపోవాని తహతహాలాడుతోందట. దీనిపై ఇపుడు కోలీవుడ్‌లో బాగానే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరగడానికి కారణం ఈ మధ్య జరిగిన "మార్కండెయన్" అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సల్మాన్‌ఖాన్ పక్కసీట్లో కూర్చొని తెగ మాట్లాడుతూ కనిపించింది. అలాగే, సల్మాన్ సోదరి పుట్టిన రోజు వేడుకల్లో కూడా శ్రియ పాల్గొని సందడి చేసిందట. ఇంతగా సల్మాన్ జపం చేస్తున్న శ్రియకు బాలీవుడ్‌ హీరో అవకాశం కల్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

బాలయ్యతో నటించిన దగ్గర్నుంచి ఒహటే వెన్నునొప్ప

"ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రానికి ముందు యువరత్న బాలకృష్ణతో నటించిన చిత్రం నుంచీ తనకు వెన్నెనొప్పి వచ్చిందనీ, అది ఇప్పటికీ తగ్గలేదని దానికి ట్రీట్‌మెంట్‌ ఇంకా తీసుకుంటున్నానని స్నేహ ఉల్లాల్‌ చెపుతోంది. తాజాగా నరేష్‌తో "మడత కాజ"లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. 

షూటింగ్ గ్యాప్‌లో షాపింగ్‌కు వెళ్ళి వస్తున్న ఉల్లాల్.. అక్కడి వెళ్ళిన కాసేటికి నొప్పి చేసిందనీ, వెంటనే తిరిగి వచ్చేశానని అంది. మరి షూటింగ్‌లో ఎలా మేనేజ్‌ చేస్తున్నారంటే... దానికి కొన్ని మందులు వాడుతున్నాననీ, త్వరలో తగ్గిపోతుందని నంగనాచిలా చెపుతోంది. 

తెలుగులో గ్యాప్‌ రావడానికి కారణంకూడా ఇదేనని అంటూ... త్వరలో పూర్తిగా కోలుకుంటానని అంది. తర్వాత చిత్రాలు గురించి చెబుతూ... ఈ చిత్రం విడుదల తర్వాత రిజల్ట్‌బట్టి నా ఫేట్‌ ఉంటుందని లేదంటే... హ్యాపీగా నాకు నచ్చిన పనిచేసుకుంటానని నిర్భయంగా చెపుతోంది

హన్సిక కోఆపరేషన్ సుపర్బ్‌గా ఉంటుంద


మస్కాలో తమ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని చాలామంది అన్నారని నటి హన్సిక చెప్పింది. తాజాగా రామ్‌తో 'కందిరీగ'లో నటించింది. ఈ సినిమాపై ఏదో రెండు విషయాలు చెప్పమని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. 

"ఇందులో రామ్‌ ఎనర్జిటిక్‌ పాత్రను పోషించారు. ఆయనకు ధీటుగానే నా పాత్ర ఉంటుంది. ఇద్దరినీ చూసి సెట్లో చాలా ముచ్చటగా ఉన్నారని కితాబిచ్చారు. మా ఇద్దరి కాంబినేషన్‌ బాగుంటుందని అంటున్నారు" అని చెప్పింది. 

రామ్‌ మాత్రం అనుకోకుండా అలా కలిసి వచ్చిందని చెబుతున్నాడు. తర్వాత చిత్రాల్లో నటిస్తుందా అంటే ఏమీ చెప్పలేమని అన్నాడు. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. హన్సిక చాలా కోఆపరేషన్‌ మనిషనీ, తనతో చేయడానికి తనకేమి అభ్యంతరం లేదని అన్నాడు.

South Indian actress Nayanthara changes religion?

Top southern actress Nayanthara has converted from Christianity to Hinduism, say sources close to the Arya Samaj, even as she herself maintains a studied silence on the issue.
Nayanthara, born and brought up as Diana Mariam Kurian, was a born Christian. She changed her name because of her foray into films.
She reportedly converted to Hinduism Sunday morning at the Arya Samaj Temple in Chennai, the sources said, adding she has retained her name Nayanthara.
Some see it as a step towards her impending marriage to actor-director Prabhu Deva who divorced his earlier wife, a Muslim and did not change her religion at the time of marriage.
Nayanthara is tightlipped. Asked about her marriage, she says: 'No comments.'
On Sunday morning, the actress reportedly headed straight to the Arya Samaj Temple on Waltax Road.
She went through all the religious processes as per the scriptures. All the procedures of 'Shuddhi Karma', a procedure involving Vedic purification, were meticulously followed, say the sources close to Arya Samaj.
They also added that a 'homan' or fire ritual was held where Nayantara chanted hymns and the Sankeerthan Mantra.
Incidentally, the members of Prabhu Deva's family are devotees of the Suttur Mutt in Mysore. His parents are devotees of Male Mahadeshwara Swamy.
The sources said Nayanthara left soon after the purification ceremony. A certificate of conversion to Hinduism was issued to her. The actress flew back to Kochi by an evening flight.
It is reported that her parents have expressed their opposition to Nayanthara's desire to convert to Hinduism.
Nayanthara's last film 'Ramayana', directed by veteran director Bapu, was completed only a few days ago.
Nayanthara who plays Sita's role in the film became emotional on the last day of her shoot and even lay prostrate before all the elders in the unit, including the octogenarian director Bapu.
Nayanthara says her decision to convert to Hinduism is purely personal.
'Yes, I have become a Hindu and it's my own personal decision. I went through the entire ceremony with passion and conviction,' she is believed to have told a friend.
She sports a tattoo of Prabhu Deva on her body. The couple were also seen in some film related functions together.

Monday, 8 August 2011

వర్మకు "ఇది ప్రేమకథ కాదు" లీగల్ నోటీసుల "లకలక"


ఒక "రక్తచరిత్ర", ఇంకొక "బెజవాడ రౌడీలు".. మరొక "ఇది ప్రేమకథ కాదు" ఇలా ఏ చిత్రం చూసినా ఏమున్నదీ..? రాంగోపాల్ వర్మ మీడియాలో నానడం తప్ప అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. తాజాగా మరియా సుసైరాజ్ జీవితగాధను ఆధారంగా చేసుకుని వర్మ "ఇది ప్రేమకథ కాదు" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 19న అన్ని ధియేటర్లలో విడుదల కానుంది. 

అయితే ఏంటట..? సినిమా అన్నాక ఏదో ఒకరోజు విడుదల కావాల్సిందేగా అంటారా..? అంతేననుకోండి. కాకపోతే వర్మ సినిమా సాఫీగా మాత్రం విడుదల కాదు. మీడియాలో ఒక రేంజ్‌లో గగ్గోలు పెట్టాక అప్పుడు తెరపైకి దూసుక వస్తుంది. ప్రేక్షకుల్ని థియేటర్లకు ఒడిసిపట్టుక వచ్చేందుకు కావల్సినంత సరుకు చిత్రం విడుదలకు ముందే జరిగిపోతుంది. తాజాగా వర్మ తెరకెక్కించిన ఇది ప్రేమకథ కాదు చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. 

పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న మరియా సుసైరాజ్ ప్రేమికుడిగా చెప్పబడే జెరోమ్ మాథ్యూస్ వర్మకు లీగల్ నోటీసులు పంపాడు. ఇది ప్రేమకథ కాదు చిత్రంలో తన పాత్రను వక్రీకరిస్తూ సినిమా తీశారనీ, ఈ చిత్రం చూస్తే తన కుటుంబం మానసిక వ్యధతో కుంగిపోవడం ఖాయమని నోటీసులో పేర్కొన్నాడు. కనుక వెంటనే ఆ సినిమాను, ఆ సినిమాకు సంబంధించిన వాల్‌పోస్టర్ ప్రమోషన్‌ను ఆపివేయాలంటూ కోరాడు. 

కానీ ఇది ప్రేమకథ కాదు చిత్ర నిర్మాత మాత్రం తమ చిత్రం కల్పిత కథ అని బుకాయిస్తున్నాడు. కల్పిత కథ అని చెపుతున్నప్పటికీ తమకు లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తాన్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

కాగా ఈ చిత్రంలో హాటెస్ట్ సన్నివేశాలకేమీ కొదవలేదు. లిప్ టు లిప్ కిస్సుల దగ్గర్నుంచి బెడ్రూం సన్నివేశాలు, బాత్‌రూంలో కలిసి స్నానఘట్టాలు వగైరా.. వగైరా.. యమ హీటెక్కించే సన్నివేశాలున్నాయి. సుసైరాజ్ జీవితకథే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రేరణ అన్నది తెలిసిన విషయమే. మరి ఈ లీగల్ నోటీసులను ఎదుర్కొని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని ఎలా విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే.

"ప్రభు"వును విడిచి పెట్టిన నటి నయనతార


తన ప్రియుడు ప్రభుదేవాను వివాహమాడేందుకు గాను అందాల నటి నయనతార సోమవారం తన మతాన్ని మార్చుకుంది. క్రైస్తవ మతస్థురాలైన నయన.. "శ్రీరామరాజ్యం" చిత్రంలో నటించిన తర్వాత మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. 

అయితే, ప్రస్తుతం ఈ వార్తలను నిజం చేస్తూ ఆమె మతం మార్చుకున్నారు. సోమవారం చెన్నయ్‌లోని అర్యసమాజ్‌లో మతం మార్చుకుంది. చెన్నయ్‌ ఆర్యసమాజ్‌లో హిందుత్వం స్వీకరించింది. నయన తార శుద్ధికర్మతో క్రిస్టియన్‌ మతం నుంచి హిందువుగా మారింది. ప్రభుదేవాతో పెళ్లి కోసమే ఆమె మతం మార్చుకున్నట్లు తెలిపింది. 

కాగా, నయనతార, ప్రభుదేవాల వివాహం త్వరలోనే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరుగనుంది. ఆ తర్వాత వీరిద్దరు సౌదీ అరేబియాలో స్థిరపడి పోవాలని భావిస్తున్నారు.