Wednesday, 10 August 2011

వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కట్: "రెబల్" షూటింగ్‌కు అనుష్క డుమ్మా..?!


ఆరడుగుల యువహీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం రెబల్. ఈ చిత్రానికి "కాంచన" ఫేమ్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటింపజేసేందుకు అతని పొడుగుకు సరిపోయే హీరోయిన్లను ఎంపిక చేశాడు లారెన్స్. 

వీరిలో ఒకరు దీక్షాసేథ్ కాగా మరొకరు అనుష్క. ఈ సినిమా షూటింగ్‌కు దీక్షాసేథ్ మాత్రమే వస్తోందట. అనుష్క డుమ్మా కొడుతున్నట్లు టాలీవుడ్ ఫిలిం జనం అనుకుంటున్నారు. దీనికి కారణాలను కూడా వాళ్లు ఊదేస్తున్నారు.

బిల్లా చిత్రాన్ని చేసే సమయంలో అనుష్క - ప్రభాస్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా నడిచిందని అంటున్నారు. అయితే ఆ కమెస్ట్రీ ఇటీవల కాలంలో బెడిసికొట్టడంతో ప్రభాస్ అంటే అనుష్కకు సరిపడటం లేదట. అందువల్లనే "రెబల్" చిత్రం షూటింగ్‌కు ఆమె రావడం లేదని భోగట్టా.

No comments:

Post a Comment