Friday, 12 August 2011

దర్శక నిర్మాతలు బయట కూడా ఎక్స్‌పోజ్ చేయమంటారు: అ


తన పేరులో ఉన్న విలక్షణతను నటనలోనూ చూపాలన్నది అక్ష కోరిక. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికి అక్ష నటించిన మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు ఘనవిజయం సాధించినవే కావడాన్నిబట్టి సినిమాల ఎంపికలో ఆమె తీసుకునే శ్రద్ధాసక్తులు మనకు సునాయాసంగా అర్థమవుతాయి. 

'యువత' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, ఆ చిత్రంతో యువతను విశేషంగా ఆకట్టుకున్న అక్ష రెండో చిత్రం 'రైడ్‌'తో తన కెరీర్‌కు ద్వితీయ విఘ్నం లేకుండా చేసుకోగలిగింది. మూడో చిత్రం 'అది నువ్వే' కాస్త నిరాశ పరిచినప్పటికీ తాజా చిత్రం 'కందిరీగ' తన కెరీర్‌కు కీలకం కానుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని అక్షతో ప్రత్యేకంగా జరిపిన ఇంటర్య్వూ.

WD
'కందిరీగ'లో మీ క్యారెక్టర్‌ ఏమిటి? 
ఫస్ట్‌ ఫస్ట్‌ క్యారెక్టర్‌ గురించి అడిగేశారా? నేనసలు చెప్పను గాక చెప్పను. నా పాత్ర చాలా కొత్తగా, భలే గమ్మత్తుగా ఉంటుందని మాత్రమే చెబుతాను. సిటీగర్ల్‌ క్యారెక్టర్‌ నాది. ఇందులో నేను మాట్లాడే భాష, నా బాడీలాంగ్వేజ్‌, నా డ్రెస్సింగ్‌ స్టయిల్‌ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఆడియన్స్‌ అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసే మంచి క్యారెక్టర్‌ 'కందిరీగ'లో పోషిస్తున్నాను.

WD
హీరో రామ్‌తో మొట్టమొదటిసారి జతకట్టారు కదా? ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్‌? 
సినిమాలపరంగా చూస్తే రామ్‌ నాకంటే చాలా సీనియర్‌. 'కందిరీగ' నేను నటిస్తున్న నాలుగో సినిమా మాత్రమే. నాకు అన్ని విషయాల్లోనూ ఓ కో-ఆర్టిస్టుగా చాలా సహకరించాడు. అతనిలోని ఎనర్జీ చూసి నేను చాలా సర్‌ప్రైజ్‌ అవుతుండేదాన్ని.

WD
హన్సికతో కలిసి నటించావు కదా. మీ ఇద్దరి మధ్య సఖ్యత బాగానే కుదిరిందా? 
హన్సిక కూడా నాకంటే సీనియర్‌ కదా. ఆమెతో కలిసి నేను మూడు సీన్స్‌ మాత్రమే చేశాను. ఆమె కూడా చాలా మంచి వ్యక్తి.

WD
'రైడ్‌' తర్వాత ఇదే బ్యానర్‌లో 'కందిరీగ' చేయడం మీకు ఎలా అనిపిస్తోంది? 
చాలా చాలా హ్యాపీగా వుంది. బెల్లంకొండ సురేష్‌గారు చాలా మంచి నిర్మాత. ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్లకు గానీ ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకసారి ఆయన బ్యానర్‌లో నటించిన వారు, పనిచేసిన వారు మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్‌లో వర్క్‌ చేయాలని కోరుకుంటారు.

WD
'కందిరీగ'లో మీ క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుందంటున్నారు‌. అందుకోసం హార్డ్‌వర్క్‌ చేయాల్సి వచ్చిందా? 
అవునండి. ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. అంతకు మించిన హోం వర్క్‌ కూడా చేశాను. చెప్పాను కదా. ఈ సినిమాలో నాది చాలా టిపికల్‌ క్యారెక్టర్‌. రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌కు భిన్నంగా ఉంటుంది.

WD
అవును. మీరింకా చదువుతున్నారట కదా? 
అవునండీ. నేను ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం ప్రైవేట్‌గా చదువుతున్నాను. ఈ రోజుల్లో మినిమం డిగ్రీ అయినా లేకపోతే కష్టం కదా.

WD
సినిమాల్లో నటిస్తూ చదువుకోవడం కష్టమనిపించడం లేదా? 
అసలు లేదు. చదువు కోసం రోజులో రెండు గంటలు విధిగా కేటాయిస్తాను. ఎప్పుడైనా ఒకరోజు మిస్సయితే మరుసటి రోజు అది, ఇది కలిపి చదివేసుకుంటాను.
WD


WD
యాడ్‌ ఫిలింస్‌లోనూ నటిస్తున్నారు కదూ? 
నేను చిన్నప్పట్నుంచి యాడ్‌ ఫిలింస్‌ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి వందకు పైగా యాడ్స్‌లో యాక్ట్‌ చేశాను. రణబీర్‌కపూర్‌తో కలిసి పెప్సీ యాడ్‌లో నటించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఎందుకంటే అతను నా ఫేవరెట్‌ హీరో.

WD
మరి తెలుగులో ఎవరంటే ఇష్టం? 
మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రామ్‌ వంటి హీరోలందరూ నాకు ఇష్టమైన వారే.

WD
హీరోయిన్స్‌లో ఎవరంటే ఇష్టం? 
హిందీలో ప్రియాంక, కత్రినా, కరీనాకపూర్‌. తెలుగులో అనుష్క, తమన్నా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ హార్డ్‌వర్కింగ్‌ నేచర్‌ని నేను చాలా ఇష్టపడతాను.

WD
'కందిరీగ' సినిమాపై మీకున్న అంచనాలేమిటి?
నేను యాక్ట్‌ చేశాను కాబట్టి చెప్పడం లేదు. యాక్ట్‌ చేశాను కాబట్టి తెలిసిన విషయం చెబుతున్నాను. 'కందిరీగ' చాలా పెద్ద రేంజ్‌లో హిట్టవుతుంది. నాతో పాటు ఈ సినిమాలో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్న సంతోష్‌ శ్రీనివాస్‌కు చాలా మంచి పేరు వస్తుంది. ఇక మా నిర్మాత బెల్లంకొండ సురేష్‌గారికి ఇప్పుడు కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాతో ఆయనకు బోలెడు డబ్బులొస్తాయి.

WD
చివరగా.. హీరోయిన్స్‌ సినిమాలోకంటే ఫంక్షకన్లకు బాగా ఎక్స్‌పోజ్‌గా కన్పిస్తున్నారు. మీరుకూడా ఓసారి అలా కన్పించారు? 
ఇదేమి తప్పుకాదు. సినిమాల్లో కన్పించినట్లు బయటకూడా కన్పిస్తే బాగుంటుందని నిర్మాత దర్శకులు కొన్నిసార్లు అలా రమ్మంటారు. దాన్ని మీరు మరింత ఎక్స్‌పోజ్‌ చేస్తారు.. నిజం చెప్పాలంటే.. ఇదో పబ్లిసిటీ.. అంటూ నవ్వేసింది.

No comments:

Post a Comment