Tuesday, 9 August 2011

బాలయ్యతో నటించిన దగ్గర్నుంచి ఒహటే వెన్నునొప్ప

"ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రానికి ముందు యువరత్న బాలకృష్ణతో నటించిన చిత్రం నుంచీ తనకు వెన్నెనొప్పి వచ్చిందనీ, అది ఇప్పటికీ తగ్గలేదని దానికి ట్రీట్‌మెంట్‌ ఇంకా తీసుకుంటున్నానని స్నేహ ఉల్లాల్‌ చెపుతోంది. తాజాగా నరేష్‌తో "మడత కాజ"లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. 

షూటింగ్ గ్యాప్‌లో షాపింగ్‌కు వెళ్ళి వస్తున్న ఉల్లాల్.. అక్కడి వెళ్ళిన కాసేటికి నొప్పి చేసిందనీ, వెంటనే తిరిగి వచ్చేశానని అంది. మరి షూటింగ్‌లో ఎలా మేనేజ్‌ చేస్తున్నారంటే... దానికి కొన్ని మందులు వాడుతున్నాననీ, త్వరలో తగ్గిపోతుందని నంగనాచిలా చెపుతోంది. 

తెలుగులో గ్యాప్‌ రావడానికి కారణంకూడా ఇదేనని అంటూ... త్వరలో పూర్తిగా కోలుకుంటానని అంది. తర్వాత చిత్రాలు గురించి చెబుతూ... ఈ చిత్రం విడుదల తర్వాత రిజల్ట్‌బట్టి నా ఫేట్‌ ఉంటుందని లేదంటే... హ్యాపీగా నాకు నచ్చిన పనిచేసుకుంటానని నిర్భయంగా చెపుతోంది

No comments:

Post a Comment