హీరో రవితేజ నటించిన "డాన్‌శీను" చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన భామ శ్రియ. ఈ చిత్రం తర్వాత తెలుగులో భారీ అవకాశాలు దక్కుతాయని ఎంతగానో ఎదురు చూసింది. అయితే, ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో చేదు అనుభవమే మిగిలింది. దాంతో అడపాదడపా తమిళ చిత్రాల్లో నటిస్తున్న శ్రియకు తెలుగులో మాత్రం అల్లరి నరేష్‌తో నటించే స్థాయికి దిగజారి పోయింది.
ఈ చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ.. సంతృప్తి చెందని ఈ పిల్ల.. బాలీవుడ్ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. ఇందుకోసం ఏకంగా సల్మాన్‌ఖాన్‌నే కాకా పడుతోందట. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన భామలకు సల్మాన్‌ఖాన్ అవకాశాలు కల్పించడంలో బాగా ముందున్న విషయం తెల్సిందే.
దీంతో ఎలాగైనా సల్మాన్‌ను తన దారికి తెచ్చుకుని బాలీవుడ్‌లో సెటిలైపోవాని తహతహాలాడుతోందట. దీనిపై ఇపుడు కోలీవుడ్‌లో బాగానే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరగడానికి కారణం ఈ మధ్య జరిగిన "మార్కండెయన్" అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సల్మాన్‌ఖాన్ పక్కసీట్లో కూర్చొని తెగ మాట్లాడుతూ కనిపించింది. అలాగే, సల్మాన్ సోదరి పుట్టిన రోజు వేడుకల్లో కూడా శ్రియ పాల్గొని సందడి చేసిందట. ఇంతగా సల్మాన్ జపం చేస్తున్న శ్రియకు బాలీవుడ్ హీరో అవకాశం కల్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

No comments:
Post a Comment