![]() |
trisha marriage |
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగాలకు చెందిన కుర్రకారు గుండెల్లో కలల రాణిగా తిష్ట వేసిన చెన్నయ్ సోయగం త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతోందా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి చెన్నయ్ కోడంబాక్కం వర్గాలు. గత కొంత కాలంగా ఈ విషయం మీద వార్తలొస్తున్నప్పటికీ ఇపుడు మరింత ఎక్కువయ్యాయి. నగరానికి చెందిన అమృత్ అనే యువ పారిశ్రామికవేత్తను త్రిష గత కొంత కాలంగా ప్రేమిస్తోందనీ, వచ్చే నెలలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్టు చెన్నయ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అందుకు తగినట్టుగానే ఆమె సినిమాలు కూడా తగ్గించేసుకుంది. మూడు పదుల వయసులో వున్న త్రిష, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటోంది. అయితే, ఈ వార్తల్ని ఆమె కుటుంబసభ్యులు మాత్రం కొట్టిపారేస్తుండగా, త్రిషా మాత్రం పెదవి విప్పడం లేదు. ఇవన్నీ ఒట్టి పుకార్లేననీ, త్రిష పెళ్లి అందరికీ చెప్పే జరుపుతామనీ ఆమె తల్లి ఉమా కృష్ణన్ అంటోంది.

No comments:
Post a Comment