Friday, 12 August 2011

పూరీకి కాజల్ మెగా ఆఫర్: టెంప్ట్ అవుతాడా...


కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఆఫర్ల కోసం వెంపర్లాడుతోంది. చేతిలో ఉన్న అన్ని అవకాశాలను బాలీవుడ్‌లో తిష్ట వేసేందుకు వినియోగించుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా కాజల్ మరో కొత్త ప్లాన్‌తో మరో బాలీవుడ్ అవకాశాన్ని ఎగరేసుకెళదామని ముందుకెళుతున్నట్లు టాలీవుడ్ న్యూస్. 

మహేశ్ బాబు సరసన "ది బిజినెస్ మేన్" చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. పూరీ ఇదే చిత్రాన్ని హిందీలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది తెలుసుకున్న కాజల్ పూరీ ముందు ఓ ఆఫర్ ఉంచిందట. 

అదేమంటే... హిందీలో కూడా హీరోయిన్‌గా తననే బుక్ చేస్తే ఫ్రీగా నటిస్తానని ఆఫర్ చేసిందట. అవసరమైతే తన పారితోషికాన్ని కూడా అటుఇటుగా చూసి తగ్గించేస్తానని పూరీని ఊరిస్తోందట. మరి కాజల్ ఆఫర్‌కు పూరీ టెంప్ట్ అవుతాడో లేదో చూడాలి.

No comments:

Post a Comment