Monday, 8 August 2011

"ప్రభు"వును విడిచి పెట్టిన నటి నయనతార


తన ప్రియుడు ప్రభుదేవాను వివాహమాడేందుకు గాను అందాల నటి నయనతార సోమవారం తన మతాన్ని మార్చుకుంది. క్రైస్తవ మతస్థురాలైన నయన.. "శ్రీరామరాజ్యం" చిత్రంలో నటించిన తర్వాత మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. 

అయితే, ప్రస్తుతం ఈ వార్తలను నిజం చేస్తూ ఆమె మతం మార్చుకున్నారు. సోమవారం చెన్నయ్‌లోని అర్యసమాజ్‌లో మతం మార్చుకుంది. చెన్నయ్‌ ఆర్యసమాజ్‌లో హిందుత్వం స్వీకరించింది. నయన తార శుద్ధికర్మతో క్రిస్టియన్‌ మతం నుంచి హిందువుగా మారింది. ప్రభుదేవాతో పెళ్లి కోసమే ఆమె మతం మార్చుకున్నట్లు తెలిపింది. 

కాగా, నయనతార, ప్రభుదేవాల వివాహం త్వరలోనే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరుగనుంది. ఆ తర్వాత వీరిద్దరు సౌదీ అరేబియాలో స్థిరపడి పోవాలని భావిస్తున్నారు.

No comments:

Post a Comment