Saturday, 26 March 2011

ఇలియానా ఇంట్లో 11 పిల్లులు.. 4 కుక్కలున్నాయి... అంతే: నితిన్

టాలీవుడ్‌లో తెలంగాణా హీరో నితిన్‌. "జయం" నుంచి దాదాపు 14 చిత్రాల్లో నటించారు. అదృష్టమో, దురదృష్టమో కానీ జయం తర్వాత ఇంతవరకూ సరైన హిట్‌ రాలేదు. అదలా ఉంచితే.. తాజాగా 'ఇష్క్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే గోవాలో షూటింగ్‌ జరిగింది. అక్కడ ఇలియానా ఇంటికి వెళ్ళి గొడవ చేశాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... అవన్నీ పుకార్లే.. షూటింగ్‌ గోవాలో ఇలియినా ఇంటి దగ్గరలోనే జరిగింది.

ఆమె ఇంటికి వెళ్ళినమాట వాస్తమే. అయితే గొడవేమీ చేయలేదు. వాళ్లింట్లో 11 పిల్లులు, 4 కుక్కలను మాత్రం చూశాను. కుక్కలు తెగ మొరిగాయి. ఆ పిల్లులంటే నాకు చికాకు. కుక్కలు అంత గొంతేసుకుని అరవడం కూడా నాకు ఆట్టే నచ్చలేదు. ఇంతకుమించి ఏమీ చెప్పడానికి లేదంటూ సెలవిచ్చారు.

No comments:

Post a Comment