Saturday, 26 March 2011

కసబ్‌ను శిక్షించే ఓ పోలీస్ ఆఫీసర్ కథ.. చట్టం

Alice At HeartAlice At Heart
నటీనటులు: జగపతిబాబు, విమలారామన్‌, ఆశాషైనీ, మురళీశర్మ, రావురమేష్‌, చలపతిరావు, అమిత్‌ధావన్‌, జీవా తదితరులు, కెమెరా: జస్వంత్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: శ్రీలేఖ, నిర్మాతలు: నట్టికుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: పి.ఎ. అరుణ్‌ప్రసాద్‌.

పాయింట్‌: కసబ్‌ను తన చట్టంతో శిక్షించే పోలీసు అధికారి కథ.

ఇది సామాన్యుని మదిలో మెదిలే ఆలోచనే. నాలోనూ ఉందంటూ జగపతిబాబు, దర్శకుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. రాజకీయనాయకుల అవినీతి రాహిత్యంవల్ల దేశంలో ఎటువంటి పనైనా ఈజీగా అయిపోతుందనేది వారి గట్టినమ్మకం. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పర్మిషన్‌ ఇవ్వకపోతే లంచం ఇవ్వగానే వెంటనే పర్మిషన్‌ ఇచ్చారని దర్శకుడే స్వయంగా చెప్పాడు. చట్టం ఇలా ఉండాలని చెప్పడానికి కూడా డబ్బులు అడుగుతుంటే... దేశం ఎటువైపు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

కథగా చెప్పాలంటే... లంచగొండి పోలీసు అధికారి గౌరీశంకర్‌(జగపతిబాబు). ఏపైనా లంచం లేనిదే చేయడు. కానిస్టేబుల్‌ రంగారావు (జీవా) ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఓసారి కాలేజీ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరగడం, మరోచోట ఓ అమ్మాయి హత్యకు గురవడం జరుగుతుంది. తన పరిధిలో ఉన్న ప్రాంతం కనుక వాటి విషయంలో లంచగొండి గౌరీశంకర్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది.

విచిత్రంగా ఈ రెండు కేసుల్లోని నిందితులుగా పిలవబడేవారు హత్యకు గురవుతారు. దానిని ఛేదించే పనిలో భాగంగా సిబిసిఐడి అధికారి మురళీశర్మ వస్తాడు. తన అసిస్టెంట్‌గా గౌరీశంకర్‌ను నియమించుకుంటాడు. మరోవైపు ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాది కసబ్‌ను చంపాలనుకుంటాడు గౌరీశంకర్‌. అందుకు ఏరోబిక్‌ సెంటర్‌ నిర్వహించే సింధు (విమలారామన్‌) సహకరిస్తుంది. మరి వీరిద్దరు ఉగ్రవాదిని ఎలా అంతంచేశారు? అంతకుముందు జరిగిన రెండు హత్యలకు కారకులు ఎవరు? అనేది సినిమా.

పోలీసు అధికారిగా జగపతిబాబు పాత్ర సరిపోయింది. గతంలో లక్ష్యం, గోడమీద పిల్లి వంటి పలు చిత్రాల్లో నటించినా. అటు లంచగొండి పాత్రతోపాటు సిన్సియర్‌ ఉద్యోగిగా రెండు పార్వ్శాల్లో అతని పాత్ర ఉంటుంది. పై అధికారిగా స్టేజీ ఆర్టిస్టు మురళీశర్మ పాత్ర సహజంగా ఉంది. ఊహించినట్లుగానే విమలారామన్‌ పాత్ర కమర్షియల్‌ అంశాలకోసం పెట్టారు. గాయం-2లో జగపతిబాబుతో మంచి రొమాన్స్‌ పండించిన ఆమె ఈ చిత్రంలోనూ పండించింది. మరో నటి ఆషాశైనీని హాట్‌లాంటి పాటలో పెట్టారు. కసబ్‌గా అమిత్‌ధాన్‌ పాత్ర బాగుంది. మిగతా పాత్రలు తమ పాత్రల మేర నటించాయి.

చిత్ర కాన్సెప్ట్‌ రీత్యా ప్రభుత్వ విధానాలు, రాజకీయనాయకుల ప్రవర్తనను చించిపారేసేలా సంభాషణలున్నాయి. ఘాటైన సంభాషణలున్నాయి. విజయవాడలో వైష్ణవి చిన్నారిని కొలిమిలో కాల్చేస్తే...వారిని ఏమీచేయలేకపోవడం.... పోలీసు అధికారులకు బులెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ కొనలేని కేంద్రప్రభుత్వం... కసబ్‌ వంటి ఉగ్రవాదిని రక్షించేందుకు కోట్లాది రూపాయల ధనవ్యయం, బుల్లెట్‌ఫ్రూఫ్‌ గది... అతను మన న్యాయవాదులతో ప్రవర్తించే తీరుపై సాగే సన్నివేశాలు, సంభాషణలు సామాన్యుడి రక్తం ఉడికిపోయేలా ఉన్నాయి.

చట్టం 'నీ అబ్బసొత్తా?' అనే ట్యాగ్‌లైన్‌.. అవును.. నా అబ్బసొత్తు అన్నంతగా ఉగ్రవాదులు భావిస్తుంటే.... సిన్సియర్‌ పోలీసు అధికారి ఎటువంటి తీర్పు ఇచ్చాడన్నది చిత్రం. ముందుగానే కథ తెలిసిపోవడం ఎలా ఉన్నా... కథాగమనాన్ని మలిచిన తీరు చివరి పది నిమిషాలు సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.

No comments:

Post a Comment