Monday, 28 March 2011

బ్రహ్మానందం చెప్పిందంతా "సుబ్బరాజు" కక్కేశాడు... ఏంటది?

ఈమధ్య డాక్టర్‌ బ్రహ్మానందంగా పిలవబడే బ్రహ్మానందం గురించి మీడియాఎక్కువగా దాడి చేస్తుంది. ఆయన చేష్టలు శృతిమించాయని అందుకే ఇలా జరుగుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. తనపై కుట్ర జరుగుతుందని ఇదంతా కావాలని చేస్తున్నారని ఆయన అంటున్నా... ఆయన అసలురంగు మాత్రం శాడిజమే... అది ఆయనకు జోక్‌గా ఉండవచ్చని టాలీవుడ్ లో కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

నటి హేమ అయితే ఘాటుగా స్పందించింది. నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసిన బ్రహ్మానందానికి అతను నిద్ర లేకుండా గడిపేటట్లు చేస్తానని సన్నిహితులతో అందట. అది ఎలా ఉన్నా... తాజాగా.. 'అహనా పెళ్ళంట' చిత్రంలో సుబ్బరాజు నటించాడు. ఆ పాత్రను తీసుకునేటప్పుడు చాలా సున్నితంగా చేయాలని దర్శకుడు చెప్పాడట.

కాంబినేషన్‌‌లో బ్రహ్మానందం కూడా ఉన్నాడు.. సెట్లోకి వెళ్ళాక... ఏంటీ? సుబ్బరాజా? ఇతనా... మీరు చెప్పినట్లు చేస్తాడా? మీరు చెప్పిన రెండింటిలో ఒకటి చేస్తే గొప్పే! అంటూ దర్శకుడు చౌదరితో అనగానే.. పక్కనే ఉన్న సుబ్బరాజు అప్పుడు ఎంత చిన్నబుచ్చుకున్నాడోకానీ... మొన్న రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్రం సక్సెస్‌మీట్‌ రోజు మాత్రం కడుపులోది కక్కేశాడు సుబ్బరాజు.

తన పాత్ర గురించి బ్రహ్మానందం ఇలా అన్నాడని మొత్తం చెప్పేశాడు. అంటే ఎదుటివారిపై ఆ డైలాగ్‌లు చెప్పడం... జోకా? శాడిజమా? లేదంటే.. బ్రహ్మానందం భాషలో... అదంతా.. వట్టిదేనా..!!!

No comments:

Post a Comment