Friday, 25 March 2011

దీపికను దెబ్బకొట్టిన మలయాళ కుట్టి అసిన్

శ్రీదేవి తర్వాత బాలీవుడ్‌లో సూపర్‌గా సక్సెస్ అయిన దక్షిణాది తారలు చాలా అరుదనే చెప్పాలి. ఇపుడు తాజాగా అసిన్ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది.

తాజాగా దీపికా పదుకునే అవకాశాన్ని అసిన్ తన్నుకెళ్లింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న "హౌస్‌ఫుల్ 2" చిత్రంలో మొదట దీపికా పదుకునేను అనుకున్నారు. ఇంతలో దర్శకుడి అభిప్రాయంలో మార్పు వచ్చింది. అసిన్ అయితే ఆ పాత్రకు సరిపోతుంది దీపకను తొలగించి ఆ స్థానంలో అసిన్‌ను ఎంపిక చేశాడట.

ఇదంతా చూస్తుంటే సీనియర్ తార శ్రీదేవి, సెక్సీ అందాల అసిన్ కు చిట్కాలు చెప్పినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే అసిన్ పొద్దస్తమానం శ్రీదేవి ఇంట్లో దర్శనమిస్తోందట.

No comments:

Post a Comment