దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. ఆయన సరసన నటించేందుకు బాలీవుడ్ సూపర్ బ్యూటీలు పోటీపడుతున్నారు. తాజాగా రజనీ తదుపరి చిత్రంలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ దీపికా పదుకునే నటించడానికి సై అన్నట్లు భోగట్టా. పదుకునె మనసులోని భావాన్ని తెలుసుకున్న ఓ కోలీవుడ్ నిర్మాత రజనీ-పదుకునే జంటగా సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా.
ప్రస్తుతం దీపికా పదుకునే చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నది. అయితే రజనీ సరసన అవకాశం అనేసరికి కొన్ని ఆఫర్లను వదులుకునేందుకు సైతం వెనుకాడటం లేదట. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని దీపికా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట.
ఇదిలావుంటే ఈ చిత్రంలో రజీనీకాంత్ ద్విపాత్రిభినయం చేయనున్నట్లు తెలిసింది. ఒక హీరోయిన్ దీపికా పదుకునే అయితే మరో హీరోయిన్ వేటలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

No comments:
Post a Comment