Thursday, 24 March 2011

కృష్ణుడు హీరోగా 'నాకూ ఓ లవరుంది'

వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన కృష్ణుడు హీరోగా మరో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే రోజున ప్రారంభమై ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ గురించి నిర్మాత కె.సురేష్‌బాబు తెలియజేస్తూ - ''నాన్‌స్టాప్‌గా జరుగుతున్న షూటింగ్‌లో హీరో కృష్ణుడు, హీరోయిన్‌ రితిక, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించడం జరిగింది. హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటివరకు 30 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయింది.

ఈనెల 24 నుంచి అందరు ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. వచ్చేనెల వరకు 70 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. బ్యాలెన్స్‌ టాకీ కూడా పూర్తి చేసి ఏప్రిల్‌ 29 నుంచి బ్యాంకాక్‌లో మూడు పాటలు చేస్తాం'' అన్నారు. దర్శకుడు కె.రామ్‌వెంకీ మాట్లాడుతూ - ''చాలా హ్యాపీగా షూటింగ్‌ చేస్తున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ కోఆపరేషన్‌ చాలా అద్భుతంగా వుంది. మేం అనుకున్నదానికంటే సీన్స్‌ చాలా బాగా వస్తున్నాయి. ఈ చిత్రానికి మెయిన్‌ ఎస్సెట్‌ సాంగ్స్‌.

రాధాకృష్ణన్‌గారు ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. పాటల రికార్డింగ్‌ మొత్తం పూర్తయింది. ఆడియో సూపర్‌ డూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. దానికి తగ్గట్టుగానే పాటల్ని రిచ్‌గా తియ్యాలన్న ఉద్దేశంతో మూడు పాటలు బ్యాంకాక్‌లో ప్లాన్‌ చేశాం. ఆల్రెడీ ఇక్కడ రెండు పాటలు తీశాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది'' అన్నారు.

కృష్ణుడు, రితిక, ఎం.ఎస్‌.నారాయణ, సురేష్‌, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్‌, ధనరాజ్‌, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్‌, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: లక్ష్మీభూపాల్‌, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: కృష్ణమాయ, కెమెరా: ఎస్‌.డి.జాన్‌, సమర్పణ: మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.రామ్‌వెంకి.

No comments:

Post a Comment